పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!

ఠాగూర్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:54 IST)
పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్‌కు చైనా ఓ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. తమకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా సంసా జీవితాన్ని గడపాలని లేనిపక్షంలో ఉద్యోగంపై ఆశలు వదులుకోవాలని చైనాకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేసింది. 
 
చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూపులో 1200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా షోకాజ్ నోటీసును జారీచేసింది. పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుందని లేదంటే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది. తన సంస్థలో వివాహితుల సంఖ్యను పెంచే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
28 నుంచి 58 యేళ్ళ మధ్య వయసుండి ఒంటరిగా ఉన్న ఉద్యోగులందరూ సెప్టెంబరులోగా వివాహం చేసుకోవాలని లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబరు వరకు కూడా వివాహం చేసుకోకుంటే ఉద్వాసన తప్పదని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలు జారీచేసిన షన్‌టైన్ కంపెనీపై చైనీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు