పెళ్ళి కొడుకు ఎలా ఉన్నా అడ్జెస్ట్ చేసుకుని పెళ్ళి చేసుకోవాలి... ఇది పెద్దవారు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలకు చెప్పే మాటలు. కానీ కలియుగంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పెళ్ళికొడుకు ఎలాంటి వాడు... అతని అలవాట్లు ఎలాంటివో తెలిస్తే తప్ప పెళ్ళి చేసుకోవడంలేదు యువతులు. కానీ ఒక యువతి ఏకంగా పెళ్ళి చేసుకోబోయే భర్తనే కాలితో తన్నింది.
వివరాలు ఇలా వున్నాయి. పాట్నాకి సమీపంలోని తిలక్‌పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ రజన్ అనే వ్యక్తికి అక్బర్‌పూర్‌కు చెందిన యోగేంద్ర రజక్ కుమార్తెకు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముహూర్తానికి పది నిమిషాలు ఉండగా ఉదయ్ రజన్ మద్యం సేవించినట్లు గుర్తించింది. దీంతో తాళిబొట్టు కడుతున్న సమయంలో అతడి నోటి నుంచి గుప్పుమంటూ మద్యం వాసన వచ్చింది.