సోషల్ మీడియాలో బటర్ దాల్ వీడియో వైరల్

గురువారం, 17 ఆగస్టు 2023 (10:38 IST)
ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేసేందుకు సోషల్ మీడియాలో చాలా వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆ వంటకాల్లో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా ఇన్‌స్టాలో విడుదలైన ఓ వీడియోలో ఫుడ్ పైన నిప్పులు చెరిగి వంట చేయడం వైరల్ అవుతోంది. 
 
బటర్ దాల్ అని పిలువబడే వంటకం ఉత్తర భారతీయుల ఇష్టమైన ఆహారంలో ఒకటి. హరిద్వార్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో వేడి వేడి నెయ్యితో బటర్ దాల్ చేసే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 
 
ఆ వీడియోలో దుకాణదారుడు ఒక ఆకుపై పప్పు వేసి, అందులో శెనగలు, అవసరమైన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుతాడు. తర్వాత స్టౌ మీద నుండి నిప్పు తీసుకుని ఆకు మీద ఉన్న పప్పు మీద గ్రేవీ లాగా పోస్తాడు. 
 
అప్పటికే చెంచాలో కొంత నెయ్యి తీసినందున, నెయ్యితో పాటు మంట కూడా ప్లేట్‌లోకి వెళుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు