గల్లీ క్రికెట్.. పోలీసు కానిస్టేబుల్ బౌలింగ్ అదుర్స్

మంగళవారం, 15 ఆగస్టు 2023 (12:45 IST)
cricket
క్రికెట్ ఆడాలంటే.. స్టామినా కావాలి. ఎందుకంటే క్రికెట్ చాలా పోటీతో కూడిన కఠినమైన క్రీడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులైనప్పటికీ క్రికెటర్లుగా రాణించే అవకాశం తక్కువేనని చెప్పాలి.

కానీ చాలామంది "గల్లీ" క్రికెట్ మాత్రమే ఆడతారు. ఇటీవల, కొంతమంది గల్లీ క్రికెట్ ప్లేయర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫేమస్ అయ్యారు.
 
ఈ క్రమంలో దుర్జన్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్ క్రికెట్ ఆడియో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన గొప్ప క్రికెట్ నైపుణ్యాలను, ముఖ్యంగా అతని సూపర్ బౌలింగ్‌ను ప్రదర్శించాడు.

జులై 31న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 7 లక్షల వ్యూస్ లభించాయి. ఈ కానిస్టేబుల్ సూపర్‌గా క్రికెట్ ఆడుతున్నాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు