సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని డీఐజీ ఆత్మహత్య... ఎక్కడ?

శుక్రవారం, 7 జులై 2023 (12:34 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో డీఐజీ ఒకరు సర్వీస్ రివాల్వర్‌త కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు విజయకుమార్. కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా పనిచేస్తున్నారు. ఈ ఘటన పోలీస్ వర్గాలను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 
 
2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయకుమార్... ఈ యేడాది జనవరి నెలలో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన చెన్నై అన్నా నగరులో డీసీపీగా పని చేశారు. దీనికిముందు కాంచీపురం, కడలూరు, తిరువారూరు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఉన్నత పదవిలో ఉండే పోలీస్ ఆఫీసర్.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పోలీసు శాఖ అన్వేషిస్తుంది. 
 
మరోవైపు, విజయకుమార్ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయకుమార్ ఆత్మహత్య వార్త విని తీవ్ర షాక్‌కు గురైనట్టు ఆయన చెప్పారు. తమిళనాడు శాఖకు తీరని లోటు అని చెప్పారు. విజయకుమార్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు