కోతి దొంగగా మారి చెట్టు ఎక్కింది. లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చుంది. దిగిరమ్మంటే ఎంతకీ రాలేదు. ఎంత వేడుకున్నా వానరం చెట్టు నుంచి కిందకు రాలేదు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు, హుస్సేన్.. కోతి నుంచి బ్యాగ్‌ను తిరిగి తీసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు.