ఈనేపథ్యంలో, రాహుల్ గాంధీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌ను ఆయన పరిణయం ఆడనున్నారని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుకార్లపై అదితి తొలిసారి స్పందించారు.
అన్నాచెల్లెళ్ల మధ్య వివాహం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆమె... పుకార్లను వినగానే తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించిందన్నారు. ఈ వార్తలో ఎటువంటి నిజమూ లేదని, తన చేత్తో రాఖీ కట్టిన రాహుల్ గాంధీ, తనకు అన్నయ్యని, ఈ పుకార్లతో తాను చాలా బాధపడ్డానని అన్నారు.
కాగా, రాయ్ బరేలీలోని వాట్స్ యాప్ గ్రూపుల నుంచి ఈ పుకార్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇక అదితి సింగ్, రాయ్ బరేలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ సింగ్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు.
యూఎస్‌లోని డ్యూక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె, గత ఎన్నికల్లో 90 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంకా గాంధీకి అదితి సన్నిహితురాలు కూడా. అందువల్లే ఆమెకు, రాహుల్‌కు వివాహమంటూ ఎవరో పుకార్లు సృష్టించారు.