ఎంపీడీవోను పరామర్శించేందుకు.. కడపకు వెళ్లనున్న పవన్ కల్యాణ్

సెల్వి

శనివారం, 28 డిశెంబరు 2024 (10:32 IST)
వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అధికారితోపాటు ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పనున్నారు.
 
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీవో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. 
 
ఛాంబర్‌​లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీవో జవహర్ బాబు తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాగా, ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా బలమైన సంకేతాలు పంపాలని అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు