ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:19 IST)
ఢిల్లీ ఎన్‌సిఆర్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి 10:31 గంటలకు భూమి ప్రకంపనలు సంభవించాయి. ఆ తర్వాత మరో 3 నిమిషాల తరువాత, అనేక రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు మళ్లీ సంభవించాయి. రాత్రి 10:34 గంటలకు, భూమి మరోసారి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
 
భూకంప కేంద్రం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. దీని తీవ్రత 6.1 గా చెప్పబడింది. మొదటి భూకంపం యొక్క కేంద్రం తజికిస్థాన్‌లో నమోదైంది. దాని పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 6.1గా ఉంది.
 

6.1 Earthquake Jolts Pakistan, India, Afghanistan & Tajikistan

Felt on Friday night at around 10:01 pm while magnitude was reported to be 6.1 on the Richter scale, depth of earthquake is 80 km & its epicenter is in 26km away from Murghob, Tajikistan

- EU Geo Survey#earthquake pic.twitter.com/heAt9xhnip

— EFF TRADE LINKS™ (@EffTradeLinks) February 12, 2021
ప్రజలు నిద్రించడానికి సిద్ధమవుతున్నప్పుడు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెపుతూ పలువురు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలు చాలా భయపడ్డారు. ఎందుకంటే ఎత్తైన భవనాలలో కంపనం ఎక్కువగా అనిపిస్తుంది. ప్రజలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు