సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో... ఓ యువతి రెడ్ టీ షర్ట్ వేసుకుని షాపింగ్ చేస్తోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఇద్దరు యువతులు వెళ్లారు. ఆ తర్వాత అటు వైపు నుంచి వచ్చిన ఓ వృద్ధుడు సరాసరి రెడ్ టీ షర్ట్ వేసుకున్న యువతి వెనుక వైపుకి చేరి తన ప్రైవేట్ భాగాన్ని ఆమెకేసి రుద్దడం ప్రారంభించాడు. దాంతో సదరు యువతి అసౌకర్యానికి గురై ఇటు తిరిగి చూసేలోపుగానే అక్కడే ఇదంతా గమనించిన మరో వ్యక్తి వృద్ధుడి దవడపై ఒక పంచ్ ఇచ్చి కింద పడేశాడు. అనంతరం అతడి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లాడు.