మహిళలు ఆధునికత పేరుతో దుస్తులు ధరించడం ఫ్యాషనైపోయింది. ఫ్యాషన్ పేరిట నుదుట సింధూరం ధరించడం, మంగళసూత్రం ధరించడం కూడా పక్కనపెట్టేస్తున్నారు చాలామంది. మంగళసూత్రాన్ని దాచేయడం.. నుదుటన చిన్న స్టిక్కర్లు వాడటం.. కొందరైతే ఆ చిన్నపాటి బొట్టు పెట్టడం కూడా వదులుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పూణే కోర్టు ఓ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.