సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ వీడియోలో, ఒక మహిళ వీధిలో నడుస్తూ, ఫోన్ కాల్లో మునిగిపోయి, తన బిడ్డను పార్కులో వదిలి వెళ్లిపోయింది. అయితే ఆమెను మేడమ్ మేడమ్ అంటూ ఓ పెద్దాయన ఆ బిడ్డను ఎత్తుకుని ఆమె చేతిలో పెట్టేవరకు ఫోనులో మాట్లాడుతూనే వున్నది. ఒక పెద్దాయన ఆ బిడ్డను చేతుల్లో మోసుకుంటూ, ఆమె వెంట పరిగెత్తి, ఆమెను పిలుస్తూ.. వెళ్లాడు. చివరికి ఆమె తనను ఎవరో ఆపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి తిరిగి చూసింది. తర్వాత ఆ పెద్దాయన చేతిలోంచి బిడ్డను తీసుకుని క్షమించండి అంటూ చెప్పింది. తర్వాత థ్యాంక్స్ చెప్పింది.