ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.70,000 జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు, అధికారుల తనిఖీ సందర్భంగా 'ELEVEN' అనే ఆంగ్ల పదం స్పెల్లింగ్‌ను సరిగ్గా రాయలేకపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.