అలాంటి వ్యక్తిని ఫాదర్స్ డే ఒక్కరోజైనా సంతోషపెట్టాలని ఆశిస్తాం. అందుకోసం గిఫ్టులు కొంటాం. ఫాదర్స్ డే కోసం మీ నాన్న కొరకు ఏమి కొనాలనే దానిపై అయోమయంలో వుంటే బాధపడకండి, ఎందుకంటే మీ కోసం ప్రత్యేక గిఫ్ట్ జాబితానే వుంది.
బడ్జెట్ గిఫ్ట్ ఐడియాలు
రూ. 500 కంటే తక్కువ చాక్లెట్లు, పుస్తకాలు
రూ. 500 నుంచి రూ. 1,000 కస్టమైజ్డ్ మగ్, ఫోటో ఫ్రేమ్
రూ. 1,000 నుంచి రూ. 2,000 షేవింగ్ కిట్, ఒక వాలెట్, ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్
రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు డిజిటల్ ఫిట్ నెస్ బ్యాండ్, బ్లూటూత్ స్పీకర్
రూ. 5,000 నుంచి రూ. 10,000 పోర్టబుల్ డిజిటల్ ఆడియో ప్లేయర్, బ్రాండెడ్ సన్ గ్లాసెస్
రూ. 10,000 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్, డిజైనర్ వాచ్.
పుస్తకాలు చదవటం మీ నాన్నకు ఇష్టమైతే, అతనికి ఒక పుస్తకం లేదా కొన్ని పుస్తకాలను కొనిపెట్టండి. రొమాన్స్, మిస్టరీ, థ్రిల్లర్ వంటి ఏ జానర్ అయినా సరే, విభిన్న జానర్స్‌కు చెందిన 2-4 పుస్తకాల కాంబోను కూడా మీరు కొనిపెట్టవచ్చు.