Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

దేవీ

శనివారం, 16 ఆగస్టు 2025 (09:09 IST)
Film Chamber office
గత కొద్దిరోజులుగా సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ రకరకాలుగా పోరాటాలు చేశారు. దానికి ట్రేడ్ యూనియన్ నాయకులతోపాటు రాజకీయపార్టీలు కూడా కార్మికుల కోసం పోరాడుతూ ముందుకు వచ్చారు. లేబర్ కమీషనర్, తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి కోమటిరెడ్డి ని కూడా కలవడం జరిగింది. అయితే ఎక్కడా అటు కార్మికులుకానీ, యూనియన్ నాయకులుకానీ, నిర్మాతలు కానీ మెట్టు దిగలేదు. ఫిలింఛాంబర్ కూడా గట్టిగా నిలబడింది. దానితో నిన్న రాత్రి నిర్మాతలమండలి ఓ ప్రకటన విడుదలచేసింది. 
 
నిర్మాతల్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన చెర్రీ (చిరంజీవి), పీపుల్స్ మీడియా నుంచి వివేక్ కూచిభొట్ల, రాధా మోహన్ తదితరులు వున్నారు.
 
వారి మాటల్లో.. మేము కార్మికలకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికి ఈ రోజు మాట్లాడుతున్నాం. మేము పెట్టిన 4 ప్రతిపాదనలు మీరు అంగీకరిస్తే వేతనాల పెంపు పై మాట్లాడడానికి మేము సిద్ధం..వీటిలో ఆల్రెడీ (1 & 2) ప్రతిపాదనలు 2022 లోనే అంగీకరించారు .
 
1. టాలెంట్ ఉన్న వారిని ఎవరినైనా పెట్టుకొనే అవకాశం.
2. ఫైటర్స్, డాన్సర్స్, రేషియో లేకుండా చూడటం.
3. 6am to 6pm ఉన్న కాల్షీట్ తో పాటు 9am to 9pm ను కూడా అమలు చెయ్యాలి.
4. ఆదివారం డబుల్ కాల్షీట్ లేకుండా చూడటం .(రెండో ఆదివారం మరియు ప్రభుత్వ ప్రకటించిన సెలవులకు డబుల్ కాల్ షీట్ ఒకే).
ఈ రెండు (3 & 4) ప్రతిపాదనల దగ్గర చర్చలు ఆగాయి..
 
మేము (నిర్మాతలు) ఎవరికి వ్యతిరేకం కాదు, కార్మికులు కూడా ప్రస్తుత పరిస్థితులు (మార్కెటింగ్, నాన్ థియేటర్స్) అర్థం చేసుకుని తమకు సహకరించాలి కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు