వివాదాస్పద అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు శనివారం తెరదించింది. వివాదాస్పద అయోధ్య భూమిని రామజన్మభూమి న్యాస్‌కే కేటాయించాలని, మసీదు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పందించారు.
ఈ తీర్పుతో హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామమందిర నిర్మాణ కల సాకారం కానుందని అన్నారు. తన దశాబ్దాల కల నెరవేరిందని, భారత సాంస్కృతిక, వారసత్వ సంపదలో రామజన్మభూమిది ప్రత్యేకమైన స్థానమని అన్నారు.