ఆ మహిళ తలను నేలకు తాకేలా అమర్చి కత్తితో ఒక్క వేటుతో నరికేసిన తలారి...

మంగళవారం, 21 ఆగస్టు 2018 (13:06 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఓ మహిళా హక్కుల కార్యకర్తకు బహిరంగంగా మరణ దండన అమలు చేశారు. ఈ శిక్షలో భాగంగా ఆమెకు  శిరచ్ఛేదనం చేశారు. మహిళా కోర్టు న్యాయమూర్తి మరణ దండన విధించడంతో ఆ మహిళా కార్యకర్తకు ఈ తరహా శిక్షను అమలు చేశారు. ఈ దారుణ శిక్షా వివరాలను పరిశీలిస్తే..
 
సౌదీలో మహిళా హక్కుల పోరాటం చేసే కార్యకర్తల్లో ఒకరు ఎస్రా అల్ ఘంఘం. ఈమెను గత 2015 డిసెంబరు 8వ తేదీన ఆ దేశ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆమె భర్త కూడా పక్కనే ఉన్నారు. 
 
షియాల ప్రాబల్యం ఉన్న ఖతీఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా, రాజకీయ నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని శాంతియుతంగా నిరసనగా ప్రదర్శనలను ఎస్రా అల్-ఘంఘం నిర్వహించేది. ఈ చర్యలను అరేబియా సర్కారు తోసిపుచ్చుతూ ఆమెపై రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగం మోపారు. 
 
అలా గత మూడేళ్ళుగా జైల్లో ఉంటూ వచ్చిన ఘంఘం కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించనందువల్ల తన తరపున వాదించేందుకు లాయర్‌ని నియమించుకోలేక పోయింది. దీంతో ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెకు బహిరంగ శిరచ్ఛేద మరణశిక్ష విధించింది. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేశాడు. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, సౌదీ అరేబియాకు కొత్త రాజుగా ఎన్నికైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలు చేపడుతూ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్న సమయంలో ఘంఘం శిరచ్ఛేదం జరగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు