ఈ భవంతిలో ప్రస్తుతం దాదాపు 40 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది వరకూ వైద్య బృందం ఉన్నట్టు సమాచారం. మంటలతో భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించగా, ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నారు. కంప్యూటర్ గదిలో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది.
కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా... ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పెయిడ్ కోవిడ్ కేర్ సెంటరులోని కరోనా రోగులను 15 అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు.