సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ముష్కర మూక దాడిపై దేశం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జవాన్లపై జరిగిన దాడితో పౌరులందరిలోనూ రక్తం సలసలా మరుగుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు... ఆ తర్వాత జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, స్థలం ఎంచుకునే అవకాశం మీదే అంటూ ఆర్మీకి ఆఫర్ ఇచ్చారు.
పొరుగున వున్న దేశం ఆర్థికంగా దివాళా తీసిందనీ, ఏమీ గతిలేని స్థితిలో చిప్ప పట్టుకుని అడుక్కుంటోందని అన్నారు. ఉగ్ర మూకలను అణచడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎలా నెట్టుకురావాలో తెలియక ఇలాంటి కుట్రపూరిత దాడులకు తెగబడుతోందని అన్నారు. వారి దేశం ఎలాంటి దరిద్రాన్ని ఎదుర్కొంటుందో అలాంటి స్థితిలోనే భారత్ వుండాలని కోరుకుంటోందనీ, అందుకోసమే ఇలాంటి ఉగ్రదాడులకు పురికొల్పుతోందని అన్నారు.