మైసూరు పాక్, గులాబ్‌ జామూన్‌, రసగుల్లా.. బడాబాబుల పేర్లు ఇలా.. శ్వేతా గౌడ ఎవరు?

సెల్వి

గురువారం, 26 డిశెంబరు 2024 (14:53 IST)
Shweta Gowda
మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌తో తనకున్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచనకు పాల్పడింది శ్వేతా గౌడ. ఈ శ్వేతా గౌడ ఎవరంటే..? మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌తో తనకున్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచనకు పాల్పడిన శ్వేతా గౌడ అనే మహిళను బెంగళూరు కమర్షియల్‌ స్ట్రీట్, భారతినగర ఠాణా పోలీసులు విచారించగా అనేక శృంగార లీలలు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ఫోన్‌లో వర్తూరు ప్రకాశ్‌ పేరును 'మైసూరు పాక్‌'గా నమోదు చేసుకోగా, మరో భాజపా నాయకుడి పేరును గులాబ్‌ జామూన్‌గా, వేరొక స్థానిక నేత పేరును 'రసగుల్లా'గా పెట్టుకుంది. 
 
ఇలానే మరికొందరి రాజకీయ నాయకులకి కూడా ఆమె ‘స్వీట్’ నామధేయాలను పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీమంతులు అనబడే బడాబాబుల కొడుకుల నామధేయాలకు బదులు '5 స్టార్', 'కిట్ కేట్', 'డైరీ మిల్క్' వంటి చాకోలెట్ పేర్లను పెట్టి నగదు సంపాదన కోసం వారికి గాలం వేసేదని అనుమానిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే కమర్షియల్‌ స్ట్రీట్లో ఆమె వంచనకు ఓ నగల వ్యాపారి కూడా బలయ్యాడని సమాచారం. దాంతోనే బెదిరింపులకు పాల్పడి అతగాడి నుండి కొన్ని ఆభరణాలు కూడా నొక్కేసిందని వినికిడి. 
 
ఈ మొత్తం వ్యవహారంలో ఆమెని వెనుక నుంచి డైరెక్ట్ చేస్తున్న ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అందమైన రూపాన్ని ఆసరాగా ఉపయోగించుకుని బడాబాబులను బుట్టలో వేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. చక్కని మాటకారి తనం.. వంపు సొంపులు, ఫేస్ బుక్ పరిచయాలే ఆమె బుట్టలో బడాబాబులను పడేలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది. 
 
ఇకపోతే.. శ్వేతా గౌడను వివాహం చేసుకునేందుకు వర్తూర్ ప్రకాష్ తిరుపతిలో నిశ్చితార్థానికి కూడా సన్నాహాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు