ఫిన్లాండ్ మహిళ రైటా.. గబ్బర్ సింగ్ పాట పాడింది. అంతే కాదు.. తెలుగు అద్భుతంగా మాట్లాడింది. తెలుగు వారిగా పుట్టి తెలుగు మాట్లాడటమే మరిచిపోతున్నారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఫిన్లాండ్కు చెందిన ఓ అమ్మాయి గబ్బర్ సింగ్ పాట పాడటం కాకుండా జనసేన గురించి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశంసలు కురిపించింది.
పవన్ గురించి ఆమె మాటల్లోనే.. పవన్ గారు పెద్ద మూవీ స్టార్ అని తెలుసు. ప్రస్తుతం పెద్ద పొలిటీషియన్ అని కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా వున్నారు. దేశానికి పవన్ కళ్యాణ్ చాలా అవసరం. సనాతన ధర్మం గురించి ఆయన చేసే కృషి గొప్పది.
Finland
జనసేన పార్టీ వుందని తెలుసు. జనసేన పార్టీ వాళ్లు కూడా అందరికీ మంచి జరగాలని..దేశం డెవలప్ అయిపోవాలని చూస్తున్నారు... అంటూ ఫిన్లాండ్ అమ్మాయి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.