సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆయన పాదయాత్రను కొనసాగించారు. వణికే చలితో మొదలెట్టి.. మండే ఎండను లెక్క చేయకుండా జగన్ పాదయాత్రను కొనసాగించారు.