ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలు చేస్తున్న సంస్థల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరు ఆస్ట్రాజెనికా ఫార్మా సంస్థతో కలిసి టీకీ తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండు దశల్లో ఈ టీకా ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
అయితే, ఈ సంస్థలు తయారు చేసిన టీకాను బ్రెజిల్ దేశంలో తీసుకున్న ఓ వలంటీర్ మరణించాడు. దీంతో ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ వలంటీర్ మరణానికి టీకా కారణం కాదని, ఇతర అనారోగ్య సమస్యల ఉన్నట్టు నిర్ధారించి, మళ్లీ ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలపై పరిశోధకులు శుభవార్త తెలిపారు. దీని ఫలితాలు అశాజనకంగా ఉన్నట్టు చెప్పారు.
రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో టీకా విజయాన్ని వివరించడానికి తాము చేసిన పరిశోధన తోడ్పడుతుందని చెప్పారు. అయితే, ఈ టీకా అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మరిన్ని విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించనున్నారు.