కరోనా ఇప్పట్లో పోదు.. దశాబ్దాల పాటు సహజీవనం చేయాల్సిందే...

మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:48 IST)
గత 2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ సోకిన ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. కోట్లాది మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికీ అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని పోరాడుతున్నారు. 
 
ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ హెచ్చరికలు చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని, దశాబ్దాల పాటు సహజీవనం చేయాల్సిందేనని ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఉన్న సమూహాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం అంతే స్థాయిలో ఉంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం అనేక దేశాల్లో కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందన్నారు. అంతమాత్రానా ఊరట చెందవద్దని, వైరస్ ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని తెలిపారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు కొనసాగుతున్నాయని అథనోమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాలకు, కామన్వెల్త్ దేశాల మధ్య ఈ వ్యత్యాసం భారీగా ఉందని, దీన్ని తగ్గించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు