ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సెప్టెంబరు 2వ తేదీన చంద్రయాన్ 2కు సంబంధించి మరో కీలక ఘట్టం ఉంటుందన్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండర్ వేరుపడుతుందన్నారు. ఇక సెప్టెంబర్ 3వ తేదీన సుమారు మూడు సెకన్ల పాటు ఓ చిన్నపాటి ప్రక్రియ ఉంటుందని శివన్ వివరించారు.
ఆ ప్రక్రియతో ల్యాండర్ పనితీరు తెలుస్తుందన్నారు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన, తెల్లవారుజామున 1.55 నిమిషాలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగుతుందన్నారు. తామంతా మానవ ప్రయత్నం చేశామని, ప్రస్తుతం లక్ష్యానికి మరింత చేరువైనట్లు ఇస్రో తన ట్విట్టర్‌లో చెప్పింది.