ఆ రెండు నగరాల్లో రిలయన్స్ జియో 5జీ ట్రూ సేవలు

శుక్రవారం, 11 నవంబరు 2022 (09:03 IST)
దక్షిణ భారతదేశంలో రెండు ప్రధాన టెక్ నగరాలైన హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో రిలయన్స్ జియో 5జీ ట్రూ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నగరాల్లో ఇప్పటికే ఎయిర్ టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ 5జీ సేవలు నగర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లోనే లభించనుంది. 5జీ స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వినియోగదారులు సరిచూసుకోవాల్సి ఉంటుంది. 
 
కాగా, హైదరాబాద్ నగరంలో ఎయిర్ టెల్ 5జీ సేవలు లభిస్తుండగా, జియో కూడా చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రూ 5జీ సేవలను ఇప్పటికే అందిస్తుంది. టెక్ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభంతో ప్రజలు జీవ ప్రమాణాలు మెరుగుపడతాయని జియో తెలిపింది. 
 
సేవల్లో నాణ్యత కోసమే ట్రూ5జీ సేవలు వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. జియో ట్రూ5జీ  వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు రుసుం చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందవచ్చని జియో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు