ముఖ్యంగా, 2016లో ఉత్తరాఖండ్‌లో హరీష్ రావత్ సర్కార్‌ను రద్దు చేసి కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను కేఎం. జోసెఫ్ కొట్టేశారు. ఇది మనసులో పెట్టుకొనే కేంద్రం ఆయన పేరును పరిశీలించడం లేదన్న విమర్శలు వచ్చాయి.
ఈనేపథ్యంలో గత నెల 16వ తేదీన మరోసారి జోసెఫ్ పేరును సిఫారసు చేస్తూ కొలీజియం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. అదే రోజు మిగతా ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్ పేర్లను కూడా ప్రతిపాదించింది. ఈ ముగ్గురి పేర్లను కేంద్రం ఆమోదించింది.