జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. అడవి నుంచి తప్పిపోయి..? (వీడియో)

సోమవారం, 12 జులై 2021 (21:55 IST)
అడవి నుంచి తప్పిపోయి ఓ గజరాజు జనావాసాల్లోకి వచ్చింది. రోడ్లపై పరుగులు తీసింది. గజరాజుని చూసిన స్థానికులు భయపడిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్‌మంగళూర్‌లో చోటుచేసుకుంది. 
 
చిక్‌మంగళూర్‌లోని ఏబీసీ కాఫీ క్యూరింగ్ ఏరియాలో ప్రవేశించిన ఏనుగు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడింది. స్థానికులు భయాందోళనకు గురై అటవీ అధికారులకు సమాచరం ఇవ్వగా.. వాళ్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని గజరాజును అడవిలోకి వెళ్లగొట్టారు.
 
జనావాసాల్లో ఏనుగు పరుగులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏనుగులు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో సరైన ఆహారం దొరక్కపోవడంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

#WATCH | Karnataka: An elephant entered Chikmagalur's ABC Coffee Curing area earlier today. It was sent back to the forest with the help of forest officials. pic.twitter.com/ASySteSgnR

— ANI (@ANI) July 12, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు