ద్రవిడ ఉద్యమ నేత, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో దేశవ్యాప్తంగా సానుభూతి పెరుగుతోంది. ఈ సానుభూతి వచ్చే ఎన్నికల్లో డీఎంకేకు ఓట్ల రూపంలో లబ్ధి చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు అపుడే అభిప్రాయపడుతున్నారు.
దీనికి కారణాలు లేకపోలేదనీ వారు విశ్లేషిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి తర్వాత ఆ పార్టీని నడిపించేందుకు సరైన నేత కనిపించలేదు. ఇది కూడా డీఎంకేకు కలిసిరానుంది. పైగా, విభేదాల మధ్య ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళనిస్వామి, పన్నీరు సెల్వానికి ప్రజల మద్దతు ఏమాత్రం లేదనే చెప్పొచ్చు. కేవలం ఎమ్మెల్యేల సంఖ్యాబలంతోనే వారు ప్రభుత్వంలో కొనసాగుతున్నారనది జగమెరిగిన సత్యం.