జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండు భాగాలుగా విడగొట్టింది. తద్వారా భారత దేశ చరిత్రలో సోమవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నట్లైంది. ఇందులో భాగంగా జమ్మూకాశ్మీర్, లడఖ్‌లుగా జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రం విడగొట్టింది. ఇందులో లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.
మరోవైపు కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత ప్రజాస్వామ్యంలోనే అత్యంత చీకటి దినమని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ నాయకత్వం 1947లో రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి భారత్‌తో చేతులు కలిపింది. కానీ ఆ నిర్ణయం ఈరోజు కశ్మీరీల పాలిట శరాఘాతంగా మారిందన్నారు.
ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధమేనని మెహబూబా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనివల్ల భారత్ జమ్మూకశ్మీర్ లో దురాక్రమణదారుగా మారుతుందని చెప్పారు.