మంచుకొండల్లో హాట్ యాంకర్... అభిమానుల కామెంట్స్

మంగళవారం, 21 మే 2019 (19:39 IST)
షూటింగ్‌లలో బిజీ బిజీగా గడిపే సినీ తారలు అప్పుడప్పుడు వెకేషన్స్ పేరుతో సేద తీరుతుంటారు. తెలుగు యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని గుల్‌మార్గ్ ప్రాంతానికి షికారుకు వెళ్లారు.


ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన ఓ వీడియోపై కొందరు అభిమానులు సెటైర్లు వేస్తూ, కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో అనసూయ ఏమన్నారంటే..
 
ఆమె గుల్మార్గ్‌లో పెరిగే పేపర్ ట్రీ బెరడును చూపిస్తూ, ‘‘మనకు పేపర్, పెన్నులు లేని కాలంలో దీనిపైనే లెటర్లు రాసేవారంట'' అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై కొందరు ఫన్నీగా, పెన్నులు లేవంటున్నారు, మరి వీటిపై లేఖలు ఎలా రాసారంటూ ఆట పట్టిస్తూ కామెంట్స్ చేసారు. తరచుగా అందమైన ఫోటోలు షేర్ చేసే అనసూయ ఈ ట్రిప్ ఫోటోలను కూడా గుల్మార్గ్ డైరీస్ పేరుతో షేర్ చేశారు. 
 
ఇక ఈ ఫోటోలకు ఫిదా అవుతున్న అనసూయ ఫ్యాన్స్ ఐ లవ్యూ అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. అనసూయ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ గుల్మార్గ్ వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు నా కొడుకుగా జన్మించావు, నేను తల్లిగా మరో జన్మ ఎత్తాను. నీపై నా ప్రేమ తరగనిది, జీవితాంతం సంతోషంగా ఉండు మై ఛాంపియన్' అంటూ కుమారుడికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు