ముఖ్యంగా, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన నడుంబిగించారు. ఇందులోభాగంగా, బెంగుళూరుకు శుక్రవారం వెళ్ళి, మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు.
ఈ భేటీ బెంగళూరులోని దేవెగౌడ నివాసం అమోఘలో జరుగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు.
మరోవైపు, బెంగుళూరుకు వెళ్లిన కేసీఆర్ వెంట పార్టీ నేతలు లేకపోగా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీలో చేరినట్టేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలంగాణాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెల్సిందే.