డ్రమ్స్ వాయిస్తున్న వధువు.. ఇంటర్నెట్‌లో వైరల్ (video)

గురువారం, 29 డిశెంబరు 2022 (22:34 IST)
తన వివాహ వేడుకలో వధువు డ్రమ్స్ వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో నుంచి భారీ స్థాయిలో నెటిజన్ల నుంచి భారీ స్పందనలను అందుకుంటుంది. ఈ ఘటన కేరళలోని గురువాయూర్ ఆలయంలో చోటుచేసుకుంది. 
 
ఈ వీడియోలో, వధువు రెడ్ కలర్ బ్రైడల్ చీరలో కనిపించింది. కేరళ సంప్రదాయ సంగీత వాయిద్యం చెండా వాయించడం కనిపించింది. ప్రదర్శనకారుల బృందం కూడా ఆమెతో పాటు ఆడుతూ కనిపించింది. 
 
వధువు తండ్రి చెండా వాయించేవాడని, వీడియో చివర్లో వరుడు, తండ్రి కూడా వధువుతో కలిసి డ్రమ్స్ వాయిస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు