మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

ఐవీఆర్

సోమవారం, 17 జూన్ 2024 (22:35 IST)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఆయన హయాంలో వైజాగ్, ఇటు తాడేపల్లి పరిధిలో వున్న ఆయా నిర్మాణాలపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తాడేపల్లి రహదారిలో మాజీ సీఎం జగన్ నివాసముండే రహదారిని ఆంక్షల పేరిట ఒక కిలోమీటర మేర పూర్తిగా వాహనదారులపై నిషేధం విధించారు. ఆ రోడ్డు ద్వారా ఎవ్వరినీ ప్రయాణించనివ్వలేదు. దీనితో వాహనదారులంతా చుట్టుతిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఐతే కూటమి ప్రభుత్వం రావడంతో ఈ నిబంధనలను నిషేధించింది.
 
రోడ్డు అనేది ప్రజల ఆస్తి కనుక వారికి స్వేచ్ఛగా వెళ్లే అధికారం వుందని, మాజీ సీఎం జగన్ ఇంటి మీదుగా వెళ్లే రోడ్డులోని అడ్డంకులను తొలగించింది. దీనితో వాహనదారులు అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకి ఎంతో సౌకర్యవంతంగా వున్నదని అంటున్నారు. మరికొందరైతే... రోడ్డు తమ ఆస్తి అన్నట్లు మాజీ సీఎం జగన్ అలా రోడ్డుకి అడ్డుగా బారికేడ్లు నిర్మించడం దారుణమంటూ విమర్శిస్తున్నారు. ఓ వాహనదారుడైతే ఏకంగా ఫేస్ బుక్ లో లైవ్ వ్యూ చూపిస్తూ ఆ వీడియోను పోస్టు చేసారు. మీరు కూడా చూడండి.

తాడేపల్లి బూత్ బంగ్లా హోం టూర్.

Dr. Sri Raghu Ram గారి ఫేస్బుక్ లైవ్ సౌజన్యంతో. pic.twitter.com/I49No8mblp

— VamsiKrishna Bandaru (@VKBandaru18) June 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు