ముంబైలో 10 రోజుల పాటు జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ముగింపు పలు గణేష్ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేసిన ఒక రోజు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆదివారం ముంబైలోని జుహు బీచ్‌లో క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిమజ్జనం తర్వాత ఈరోజు జుహు బీచ్‌లో మేము బీచ్ క్లీనప్ నిర్వహించాము. మన బీచ్‌లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నందున వివిధ సంస్థలు మాతో చేరాయని వెల్లడించారు.
అమృత ఫడ్నవీస్ స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా పాల్గొన్నారు. క్లీనింగ్ కార్యక్రమం సంగతి అటుంచితే అమృత ఫడ్నవిస్ ధరించిన టైట్ ఫిట్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి పబ్లిక్ ప్రదేశాలలోకి అలా జిమ్ వస్త్రాలను ధరించి రావచ్చా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే అందులో అంతగా చర్చించుకోవాల్సిన విషయం లేదంటూ కొట్టి పారేస్తున్నారు.