Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

సెల్వి

గురువారం, 30 అక్టోబరు 2025 (18:54 IST)
Minor Girl
మైనర్ బాలిక పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మైనర్ బాలుడు కారు నడుపుతూ.. రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై బండిని పోనిచ్చాడు. 
 
ఈ ప్రమాదంలో చిన్నారి కారు చక్రాల కిందకు వెళ్లకుండా.. మధ్యలోనే ఉండడంతో తృటిలో ప్రమాదం తప్పింది. కారు ఢీకొట్టడం వల్ల చిన్నారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటన మొత్తం అక్కడి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంత వాసులు కారును నడిపినన మైనర్ బాలుడిపై చేజేసుకున్నారు. అజాగ్రత్తగా బండిని నడపడంపై మండిపడ్డారు. 
 
రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రమాదకర రీతిలో కారు నడిపి చిన్నారికి గాయాలు చేసినందుకు సదరు బాలుడిపై కేసు నమోదు చేశారు. అలాగే బాలుడు మైనర్ కావడంతో తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

#Ahmedabad????⚠️ Disturbing Visuals

“Minor Boy” driving Swift without Rear Number Plate runover 3 year old. 3 year old escaped luckily. ????

Age Group 14-17 responsible for max misadventures…@DriveSmart_IN @dabir @uneaz @InfraEye
pic.twitter.com/Sv0uBlzo6g

— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 29, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు