విజయవాడలో మంకీపాక్స్ కలకలం

ఆదివారం, 17 జులై 2022 (14:13 IST)
ఇటీవల కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన మంకీఫాక్స్ ఇపుడు విజయవాడ నగరంలో కూడా కలకలం రేపింది. విజయవాడ నగరానికి చెందిన ఓ చిన్నారిలో మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. 
 
దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ ఫాక్స్‌ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. దీంతో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. 
 
అంతేకాకుండా, ఆ చిన్నారి కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు. ఈ సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు