నా స్నేహితుడు చంద్రబాబు తప్పు చేసి వుండరు, త్వరలో బైటకు వస్తారు: లోకేష్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:15 IST)
అవినీతి కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu Naidu) తనయుడు నారా లోకేష్‌(Nara Lokesh)ను నటుడు రజనీకాంత్(Rajinikanth) ఓదార్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై రజనీకాంత్ నారా లోకేష్‌తో మాట్లాడినట్లు సమాచారం. రజినీకాంత్ ముందుగా నారా లోకేష్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని సమాచారం.
 
ఈ సందర్భంగా లోకేష్‌తో మాట్లాడుతూ... "ధైర్యంగా ఉండండి. నా స్నేహితుడు (చంద్రబాబు నాయుడు) తప్పు చేసి ఉండడు. ఆయన చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను కాపాడతాయి. నిత్యం ప్రజల కోసం ఆయన చేసిన కృషి, అంకితభావం ఎప్పటికీ వృథా కాద''ని రజినీ అన్నారు.
 
ప్రస్తుత అరెస్టు గానీ, ఆయనపై వచ్చిన అభియోగాలు గానీ చంద్రబాబు నాయుడు ప్రతిష్టను ఏ విధంగానూ ప్రభావితం చేయవనీ, తన నిస్వార్థ ప్రజాసేవ వల్ల త్వరలో జైలు నుంచి బయటకు వస్తానని రజనీ నమ్మకంగా చెప్పినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు