లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే, సభాపతి సుమిత్రా మహాజన్ తన స్థానంలోకి రాకముందు నుంచే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. 'వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు' అంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా అన్నాడీఎంకే సభ్యులు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
మరోవైపు, తన రాజ్యసభ సభ్యత్వానికి సీఎం రమేష్ రాజీనామా చేశారు. గతంలో ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ నుంచి సీఎం రమేష్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల దృష్ట్యా రెండు ప్రాంతాల్లో ఆయన ఎంపీగా కొనసాతున్నారు. ఏప్రిల్ 2తో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎంపీ పదవీకాలం ముగియనుండటంతో రమేష్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు