వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో వుంటారు ఈయన. కాకపోతే ప్రస్తుతం ఆయన కాస్త విరామం తీసుకుంటున్నట్లు కనిపించినప్పటికీ ఆయన చెప్పిన పాత వీడియోలు మాత్రం సందర్భానుసారంగా వైరల్ అవుతుంటాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఒక్కరోజు పాటు జైలులో వుండాల్సి వచ్చింది. దీనిపై గతంలో అల్లు అర్జున్ గురించి వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే.... అల్లు అర్జున్‌కి రాజయోగం వుందనీ, మరో 15 ఏళ్లపాటు తిరుగు వుండదని అందులో చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను ఉటంకిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజయోగం అంటే ఇదేనా... జైలుకి వెళ్లడమా అంటూ ప్రశ్నిస్తున్నారు.