అమెరికాలో భారీ మంచు తుఫాను.. నయాగరా జలపాతం ఫ్రీజ్

గురువారం, 29 డిశెంబరు 2022 (19:26 IST)
Niagara Falls
అమెరికాలో భారీ మంచు తుఫాను వీస్తోంది. భారీ నయాగరా జలపాతం గడ్డకట్టింది. ప్రపంచమంతా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతుండగా.. అమెరికా మాత్రం మంచులో కూరుకుపోయింది.

రికార్డు స్థాయిలో హిమపాతం కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొనడంతో క్రిస్మస్ వేడుకలు నిలిచిపోయాయి.
 
పలు ప్రావిన్స్‌లలో అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. రోడ్లన్నీ మంచుతో కప్పబడి వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో, భారీ మంచు కారణంగా కొంతమంది తమ కార్లలో గడ్డకట్టి మరణించారు.
 
అమెరికాలోని ప్రసిద్ధ నయాగరా జలపాతం విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టింది. రానున్న రోజుల్లో మరింత మంచు కురుస్తుందనే అంచనాతో అమెరికాలో నూతన సంవత్సర వేడుకలు లేకుండా పోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు