డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

ఠాగూర్

శుక్రవారం, 24 జనవరి 2025 (13:56 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు‌ను రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ దేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు.
 
జనవరి 20వ తేదీన యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్వీ నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్‌పై దాడిచేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి. 
 
దీంతో ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు కోర్టును సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫర్.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు