ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిక్కోలు అంటే నాకు విపరీతమైన అభిమానం. అందులో పచ్చటి ఉద్దానం అంటే ఎంతో ఇష్టం. అటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు సర్వనాశనమైపోయింది. బాధితుల కష్టాలు వింటుంటే నాకు కన్నీళ్లోస్తున్నాయి. జిల్లాలో తుఫాను నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియలేదు.
తితలీ తుఫాన్ కారణంగా పచ్చటి ఉద్దానం మొత్తం సర్వనాశనమైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లొస్తున్నాయన్నారు. మూడు రోజులు తాను ఉద్దానంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరఫున నమోదు చేస్తామని వివరించారు.
ఆతర్వాత రంగాల వారీగా నష్ట నివేదివను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తా నని చెప్పారు. బాధితులకు పదేళ్ల పాటు పరిహారం ఇవ్వాలని నివేదిక ఇస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చా రు. పర్యటనలో తనకు చాలామంది బాధితులు సాయం విషయంలో ఫిర్యాదు చేశారని, మరికొంతమంది తాగు నీరు అందడం లేదన్నారు.