ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ఉంది. ఇప్పటి నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తే చాలా మంచిది. నేను అదే చెబుతున్నా. ఈసారికి నా మాట వినండి.. జనసేన జెండాను చేతిలో పట్టుకుందాం. జనం సమస్యలపై పోరాడుదాం. ఇదే సరైన సమయం. రెండు ప్రధాన పార్టీలపై జనం పూర్తిగా విసిగిపోయారు. ఆలోచించు అన్నా. ఇదిగో జనసేన క్యాలెండర్.. దీన్ని చేతిలో పెట్టుకో. మనం ముందుకు సాగుదాం అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
అయితే చిరంజీవి మాత్రం ఆవేశానికి లోనవ్వకుండా తమ్ముడిని సముదాయించే ప్రయత్నం చేశారట. దేనికైనా ఓపిక కావాలి. నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను. మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదు. కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వు. మొదట్లో నేను రాజకీయాల్లో ఇబ్బందిపడ్డ విషయం నీకు తెలుసు కదా. వెయిట్ చెయ్. చూద్దామంటూ పవన్ కళ్యాణ్‌కు నచ్చజెప్పారట చిరంజీవి.