డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా చేస్తున్న సంచలనం చూసి సినీ పండితులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే... ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు కానీ.. మరీ.. ఈ రేంజ్‌లో అవుతుందని అనుకోలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ బ్లాక్‌బష్టర్ అయ్యింది. రామ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది.
ఇదిలా ఉంటే... ఇస్మార్ట్ బ్లాక్ బష్టర్ అనే టాక్ రావడంతో పూరికి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. యువ హీరోలు, సీనియర్ హీరోలు పూరితో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే... పూరి ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఇప్పటివరకు ఆయనతో నాలుగుసార్లు సినిమా చేయాలనుకున్నాను కానీ.. కుదరలేదు.
మ్యాటర్ ఏంటంటే... పూరి ఇస్మార్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. చిరు కొరటాల సినిమాల కోసం వైజాగ్‌లో కసరత్తలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పూరి, చిరుకి కథ చెప్పడం అనేదే జరగలేదు అని సమాచారం. అవకాశం ఇస్తే.. 5 రోజుల్లో కథ రెడీ చేస్తానంటున్నాడు పూరి. మరి.. చిరు పూరికి అవకాశం ఇస్తాడా..? లేదా..? చూద్దాం.