బస్సు మెట్లపై జర్నీ.. నటి రంజనా అడిగిందని.. అరెస్ట్.. నెటిజన్ల ఏమంటున్నారంటే?

శనివారం, 4 నవంబరు 2023 (17:38 IST)
Ranjana
తమిళనాట బీజెపీ సభ్యురాలు, న్యాయవాది, నటి రంజనా వివాదం చిక్కుకుంది. చెన్నైలోని కెరుగంబాక్కం ప్రాంతంలో తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సు మెట్లపై వేలాడుతూ కొంత విద్యార్థులు వెళుతుండటం చూసిన ఆమె.. వెంటనే తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసి బస్సును ఆపారు. ఆపై ఫుడ్ బోర్డుపై వున్న విద్యార్థులను మందలించారు. 
 
మెట్లపై వేలాడుతున్న విద్యార్థులపై కోపంగా దాడిచేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో కూడా గొడవ పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు నెటిజన్లు. కాగా, నటి రంజనాపై ఆ బస్సు డ్రైవర్ శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా రంజనా ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె చేసింది కరెక్టే అయినా.. చెప్పిన విధానం తప్పని మండిపడుతున్నారు. ఆమె ఫుట్ బోర్డుపై వెళ్తున్న విద్యార్థుల కోసమే ఇదంతా చేశారని చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు