Porcupine : పులికి చుక్కలు చూపించిన ముళ్ల పందులు.. బిడ్డల్ని ఎత్తుకెళ్తావా? (video)

సెల్వి

గురువారం, 12 డిశెంబరు 2024 (13:21 IST)
Porcupine_Tiger
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా.. నెటిజన్లు వీడియోను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని రోడ్డుపై రెండు ముళ్లపందులు తమ పిల్లలతో కలిసి వెళ్తుంటాయి. అదే సమయంలో అక్కడికి ఓ చిరుత పులి వస్తుంది. 
 
ముళ్లపంది పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేస్తుంది. కానీ పులిని గమనించిన ముళ్లపందులు.. వెంటనే పిల్లలకు రక్షణగా నిలుస్తాయి. తమ పొడవాటి ముళ్లులతో పులి మీద దాడి చేస్తాయి. దీంతో వాటి పిల్లలను కనీసం తాకడానికి కూడా పులి వల్ల సాధ్యం కాదు. చాలా సేపు పులి ముళ్ల పందులతో పోరాడింది. అయితే ముళ్ల పందులు చిరుతకు చుక్కలు చూపించాయి. 
 
ఒకానొక సందర్భంలో ముళ్లులతో గట్టిగా పొడుస్తాయి. దీంతో చాలా ముళ్లులు పులి మూతి, కాలికి గుచ్చుకుంటాయి. వాటిని తొలగించుకునేందుకు చిరుత పులి తెగ ఇబ్బంది పడుతుంది. చివరకు తన వల్ల కాదని తోక ముడుస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది తమ కెమెరాల్లో బంధిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Ahora sabemos por qué todos respetan a los puercoespín. pic.twitter.com/U5SOBKdijj

— Somos Cosmos (@InformaCosmos) December 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు