ప్రకృతికి సంబంధించిన అందాలను ప్రతిబింబించే వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వున్నాయి. అలాగే జంతువులకు సంబంధించిన వీడియోలను భారీగా పోస్టు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
పాముల్లో ముఖ్యంగా కొండచిలువలకు సంబంధించిన వీడియోలో ఎన్నెన్నో ఇప్పటికి వైరల్ అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ కొండ చిలువకు సంబంధించిన వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ అకౌంట్ పోస్టు చేసింది.
ఈ వీడియోలో కొండచిలువ జింకను బాగా చుట్టేసింది. దాన్ని చుట్టేసి ప్రాణం తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా ఓ రోడ్డుపై జరిగింది. ఇంతలో ఆ వైపుగా వచ్చిన కారు.. ఆగింది. అందులో నుంచి వ్యక్తి దిగి సాహసం చేశాడు. కొండ చిలువ బారి నుంచి జింకను కాపాడే ప్రయత్నం చేశాడు. ఓ పెద్ద కర్రను తీసుకుని కొండ చిలువ చర్మంపై కొట్టాడు.
You are driving and you see this, would you intervene or let the circle of life continue? pic.twitter.com/VTYlu18VUA
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 20, 2024
అయితే ఆ కొండ చిలువ వ్యక్తిపై తిరగబడింది. అయినా లెక్క చేయని ఆ వ్యక్తి కర్రతో పామును బలంగా కొట్టాడు. అంతే ఆ పాము జింకను వదిలి పొదల్లోకి పారిపోయింది.
జింక పాము బారి నుంచి తప్పించుకుని.. దేవుడా బతికిపోయాను అంటూ పరుగులు తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొండ చిలువ బారి నుంచి జింకను కాపాడిన వ్యక్తి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.