ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటి దురుసు అంటూ ముద్ర వేసుకున్న బీజేపీ ఎంపీలు ఒకడుగు ముందుకేశారు. ఇంకా దావూద్ ఇబ్రహీంకు దీపికా పదుకునేకు సంబంధం వున్నట్లు బీజేపీ ఎంపీ రాజేష్ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి అంత ధైర్యంగా దీపికా వెళ్లడం వెనుక దావూద్ హస్తం వుందంటూ చెప్పారు. ప్రస్తుతం రాజేష్ సిన్హా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు జేఎన్‌యూలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దుండగుల దాడిలో గాయపడిని వారిని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. ఇంకా జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో కనిమొళి మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలు ఆయిషీ ఘోష్‌ను అడిగి తెలుసుకున్నారు.
దీనిపై కనిమొని స్పందించారు. దీపికా పదుకొనేను నెటిజన్లు ట్రోలింగ్ చేయడం తప్పుబట్టారు. దీపికా సినిమాలు చూడొద్దని నెటిజన్లు పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. ఇప్పటి వరకు తాను హిందీ సినిమాలు చూడలేదని, దీపిక మద్దతుగా ఆమె నటించిన హిందీ చిత్రం ఛపాక్ చూస్తానని స్పష్టం చేశారు.