పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

సెల్వి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (22:26 IST)
RTC MD Sajjanar
పిల్లలను బయటికి తీసుకెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇటీవలే ఉత్తరాదిన ఓ బాలుడు కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరవలేదు. ఆ బాలుడి తండ్రి ఫోన్ చూస్తూ తన వెనుక వస్తున్న బాలుడిని పట్టించుకోలేదు. కానీ ఆ బాలుడు తండ్రి వెనుక వస్తూ వస్తూ వేగంగా తండ్రిని దాటుకుని ముందుకెళ్లాడు. 
 
ఆ సమయంలో ఉన్నట్టుండి కారు అటువైపు వేగంగా రావడంతో ఆ బాలుడిపై కారు వెళ్లింది. ఈ ఘటనలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో బైకుపై వున్న తండ్రి దిగేలోపే.. బైకు నుంచి కిందకు దించిన బాలుడు రోడ్డుపైకి వేగంగా వెళ్లాడు. ఇంతలో ఓ లారీ అతనిపైకి దూసుకొచ్చింది. అయితే ఆ బాలుడు అదృష్టవంతుడు. ఆ లారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆ తండ్రికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. 
 
ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌ ద్వారా షేర్ చేశారు. పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశం ఉందంటూ సజ్జనార్ ఈ వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ పిల్లాడు అదృష్టవంతుడని విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు...!

పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశం ఉందంటూ 'ఎక్స్' వేదికగా ఓ వీడియో షేర్ చేసిన సజ్జనార్ pic.twitter.com/IF5L3fbJQK

— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు